AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదిలాబాద్ కు.. రేవంత్ దిశ దశ.. జనవరి 26 తర్వాత జిల్లాకు

ఈ జిల్లా నుండే పర్యటనలకు శ్రీకారం

గెలిచినా.. ఓడినా మీరే ఎమ్మెల్యేలు

మీ ద్వారానే డెవలప్ మెంట్.. సంక్షేమ కార్యక్రమాలు

జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ద్వారా పనులు

ఆదిలాబాద్ ను ప్రగతిపథంలో నిలుపుదాం – సీఎం హామీ

సీతక్క నాయకత్వంలో ఆదిలాబాద్ ను తీర్చిదిద్దుదాం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పై సీఎం సమీక్ష- మంత్రి సీతక్క

ఆదిలాబాద్ కు సిమెంట్ ఫ్యాక్టరీ, యూనివర్శిటీ ఇవ్వండి- సీఎంను కోరిన కంది శ్రీనివాసరెడ్డి

చనాకా కొర్టా పూర్తిచేసి.. నీరందించండి – కంది శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి

చెన్నూరు లో బ్యాక్ వాటర్ సమస్య సీఎం ద్రుష్టికి- వివేక్

నియోజకవర్గాల సమస్యలపై ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, వివేక్, వినోద్, బొజ్జుల వినతి

సమావేశంలో పాల్గొన్న శ్రీహరిరావు, గజేందర్, శ్యాంనాయక్

(హైదరాబాద్, అమ్మన్యూస్ ప్రతినిధి )
ఆదిలాబాద్ జిల్లాను ప్రగతిపథంలో ముందుకు తీసుకువెళతామని, జనవరి 26 తర్వాత ఆదిలాబాద్ జిల్లా నుండే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జిలతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి నేతలకు దశదిశ నిర్దేశించారు. గెలిచినా, ఓడినా తమకు అందరూ సమానమేనని, గెలిచిన వారితో సమానంగా ఓడిన వారికి కూడా ప్రాధాన్యమిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా డెవలప్ మెంట్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జిల నుండి అభిప్రాయాలు సేకరించారు.

ఆదిలాబాద్ ప్రగతికి సీఎం శ్రీకారం – మంత్రి సీతక్క
ఆదిలాబాద్ ప్రగతిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని మంత్రి సీతక్క తెలిపారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ ఛార్జిలతో సమావేశం నిర్వహించారని, ప్రతి నియోజకవర్గానికి పదికోట్ల స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ మంజూరుచేశారన్నారు. ఈనెల 26 తర్వాత ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లా నుండే జిల్లాల పర్యటన ప్రారంభిస్తారని, ఇంద్రవెల్లి వస్తారన్నారు.


సీఎం దృష్టికి నియోజకవర్గ సమస్యలు – కంది శ్రీనివాసరెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి నియోజకవర్గ సమస్యలు తీసుకెళ్ళినట్లు కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ లో ఉన్న అపార నిక్షేపాలను దృష్టిలో పెట్టుకుని సిమెంట్ ఫ్యాక్టరీని ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో ఏర్పాటుచేయాలని, చనాకా కొరటా ప్రాజెక్టు పూర్తి చేసి నియోజకవర్గంలోని భూములకు సాగునీరందించాలని, ఆదిలాబాద్ కు యూనివర్శిటీ మంజూరుచేయాలని కంది శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా సీఎంను కోరారు. చెన్నూరు బ్యాక్ వాటర్ తో పాటు సింగరేణి సమస్యలను ఎమ్మెల్యే వివేక్ సీఎం దృష్టికి తీసుకెళ్ళారు.

ANN TOP 10