AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గంజాయికి బానిసై!.. చివరికి రైలు కిందపడి ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య..

హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య కలకలంరేపింది. గంజాయికి అలవాటు పడి మానుకోవడం కష్టంగా మారి చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. విజయకుమార్‌ నారపల్లిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బీబీనగర్‌ వైపు నుంచి సనత్‌నగర్‌ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని దగ్గర దొరికిన పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇతర పత్రాల ఆధారంగా గుర్తించారు. వెంటనే అతడు చదువుతున్న కాలేజీ నిర్వాహకులకు, పెద్ద చర్లపల్లిలోని తండ్రి శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు.

విజయ్‌కుమార్ ఘట్‌కేసర్‌లోని ఓ కళాశాలలో డిప్లమో చదువుతున్నప్పుడే గంజాయికి అలవాటుపడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరో ఇంజినీరింగ్‌ కాలేజీలో చేర్పించగా.. అక్కడగా వ్యసనానికి బానిసైనట్లు తండ్రి శ్రీనివాస్‌ తెలిపారు. ఫస్టియర్‌లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో చదువు మానిపించి చర్లపల్లిలో చికెన్‌ సెంటర్‌ పెట్టించారు. విజయ్‌కుమార్‌ మానసికంగానూ కుంగిపోవడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఎడిక్షన్‌ కేంద్రంలో చికిత్స చేయిస్తున్నారు.

అతడు మాత్రం పూర్తిగా కోలుకోలేదు.. అయితే తాను చదువుకుంటానని చెప్పడంతో నార్లపల్లిలోని కాలేజీలో సెకండియర్ చేర్పించారు. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. కొద్ది నెలలుగా తన మనసు బాగాలేదని ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుండటంతో తల్లిదండ్రులు ధైర్యం చెప్పారు. అయినా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి చెబుతున్నా. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10