AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జపాన్‌ భూకంపాల్లో 13 మంది మృతి..

జపాన్‌లో సోమవారం సంభవించిన వరుస భూకంపాల ఘటనల్లో కనీసం 13 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న తీర ప్రాంతం ఇషికావాలో ఈ మరణాలు సంభవించినట్లు తెలిపారు. మరోవైపు జపాన్‌ వాతావరణ సంస్థ నిన్న జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది. అయితే, మరోసారి భూప్రకంపనలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇషికావా ప్రిఫెక్చర్‌లోని పలు నగరాల్లో సునామీ అలలను గుర్తించారు. వాజిమాలో 1.2 మీటర్లు, కనజావాలో 90 సెం.మీ ఎత్తులో అలలు ఎగిసిపడ్డట్లు అధికారులు తెలిపారు. ఓ కూలిన భవనం శిథిలాల నుంచి ఓ వృద్ధుణ్ని బయటకు తీశామని.. కానీ, తర్వాత ఆయన చనిపోయాడని ఇషికావా పోలీసులు తెలిపారు. మరో ఐదుగురు సైతం మరణించినట్లు వెల్లడించారు.

ANN TOP 10