AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మల్లన్న మూలవిరాట్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత

సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మల్లికార్జున స్వామివారి మూలవిరట్ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ ఈవో బాలాజీ శర్మ తెలిపారు. ఉత్సవ విగ్రహాలతో భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. జనవరి 7న స్వామివారి కల్యాణం సందర్భంగా మూలవిరట్‌కు రంగులు అద్ది సుందరీకరణలో భాగంగా నిజరూప దర్శనాన్ని నిలివేసినట్లు వివరించారు. జనవరి 7న దృష్టి కుంభం అనంతరం స్వామివారికి ఛత్రకన్ను అమర్చిన తర్వాత స్వామివారి మూలవిరాట్ దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో బాలాజీ శర్మ వెల్లడించారు.

ANN TOP 10