తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పౌరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇనుప కంచెలు, నిర్బంధాలు 2023లో తొలగిపోయాయని, కొత్త సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. అన్ని వర్గాల సహకారంతో ప్రజాప్రభుత్వం కొలువుదీరిందని, 2024ను రైతు-మహిళ-యువత నామసంవత్సరంగా సంకల్పం తీసుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.
అటు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఏడాదిలో ప్రజల జీవితాల్లో ఆనందం నిండాలని అభిలషించారు.
ఇంటింటా కాంతులు వెల్లివిరియాలి: భట్టి
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు 2024 సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.









