ఢిల్లీ: నూతన సంవత్సరంలో కార్ల కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆటోమొబైల్ సంస్థలు..ఈ నెలలో మాత్రం భారీగా రాయితీలు ప్రకటించాయి. ఏడాది చివర్లో విక్రయాలు అంతం త మాత్రంగానే ఉంటాయన్న అంచనాతో ఆటోమొబైల్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి డిస్కౌంట్లను తెరపైకి తీసుకొచ్చాయి. ఈ ఏడాది కూడా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్‌తోపాటు ఇతర సంస్థలు భారీగా రాయితీలు ప్రకటించాయి.
పాత స్టాక్‌ను వదిలించుకోవడానికే..
ఆటోమొబైల్ సంస్థలు తమ వద్ద ఉన్న పాత స్టాక్స్‌ను వదిలించుకోవాలనే ఉద్దేశంతో పలు మాడళ్లను తక్కువ ధరకే విక్రయిస్తున్నాయి. దీంట్లో భాగంగా సంస్థలు రూ.2 లక్షల వరకు తక్కువ ధరకే ఆయా మోడళ్లను అమ్ముతున్నాయి. ఈ రాయితీలు ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయని కంపెనీలు పేర్కొంటున్నాయి.
జనవరిలో వాత తప్పదు..
డిసెంబర్‌లో తక్కువ ధరకే వాహనాలను విక్రయిస్తున్న సంస్థలు..ఆ మరుసటి నెల కొత్త సంవత్సరం తొలి నెల జనవరిలోనే వాహన ధరలను పెంచుతున్నట్టు ఇదివరకే ప్రకటించాయి. దీంతో కొనుగోలుదారులు ఈ నెలలోనే తమకు నచ్చిన వాహనాన్ని తక్కువ ధరకే దక్కించుకోవచ్చును. ఇంచుమించు అన్ని సంస్థలు తమ మాడళ్ల ధరలను పెంచుతున్నట్టు ఇదివరకే ప్రకటించాయి కూడా.
మారుతి సుజకీ రాయితీ ఇస్తున్న మాడళ్లు ఇవే..
ఐదు డోర్లు కలిగిన జిమ్నీపై రూ.2.21 లక్షల వరకు రాయితీ ఇస్తున్నది.
ఫ్రాంక్స్ ఎస్‌యూవీపై రూ.25 వేల వరకు డిస్కౌంట్. వీటిలో రూ.15 వేలు నగదు రాయితీ ఇస్తున్న సంస్థ..మరో రూ.10 వేలు ఎక్సేంజ్ బోనస్
హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై రూ.30 వేలు నగదు డిస్కౌంట్‌తోపాటు 10 వేలు ఎక్సేంజ్ బోనస్
గ్రాండ్ విటారాపై రూ.15 వేలు నగదు రాయితీ, ఇగ్నిస్‌పై రూ.40 వేల నగదు రాయితీ, అదనంగా ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.15 వేలు
హ్యుందాయ్..
గ్రాండ్ ఐ10 నియోపై రూ.45 వేల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నది. వీటిలో రూ.35 వేల వరకు నగదు రాయితీ, ఎక్సేంజ్ బోనస్ కింద రూ.10 వేలు
ప్రజాదరణ పొందిన ఐ20, ఐ20 ఎన్-లైన్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ.50 వేల వరకు
ఐ20 ఎన్-లైన్‌పై రూ.50 వేల వరకు నగదు డిస్కౌంట్, టస్కన్ ఎస్‌యూవీపై రూ.1.5 లక్షల వరకు నగదు డిస్కౌంట్
మహీంద్రా..
మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ మాడల్‌పై భారీ డిస్కౌంట్ 4.2 లక్షల వరకు కల్పిస్తున్నది.
ఎక్స్‌యూవీ 300 టాప్-ఎండ్ మాడల్‌పై రూ.1.78 లక్షల వరక రాయితీ
ఫోక్స్‌వ్యాగన్..
ప్రీమియం టైగూన్‌పై నగదు డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్, సర్వీస్ ప్యాకేజింగ్ కింద రూ.4.2 లక్షల వరకు కల్పిస్తున్నది.
వర్చస్ సెడాన్‌పై రూ.50 వేల నగదు రాయితీ కలుపుకొని ఎక్సేంజ్ బోనస్ కింద రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.17 వేలు కలుపుకొని మొత్తంగా రూ.1.17 లక్షలు రాయితీ ఇస్తున్నది.
హోండా కూడా..
మరో కార్ల సంస్థ హోండా కూడా పలు మాడళ్లపై రాయితీని ప్రకటించింది. అమేజ్‌పై రూ.77 వేల రాయితీని ప్రకటించిన సంస్థ..సిటీపై లక్ష రూపాయల వరకు ప్రత్యేక రాయితీని ఇస్తున్నది.