భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగరాసింది. గత 40 ఏళ్లుగా భువనగిరిలో విజయం సాధించని కాంగ్రెస్. ఈ ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగురవేసింది. భువనగిరిలో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డిపై 25,761 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపొందారు. అనిల్ గెలుపుతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.









