తెలంగాణలో తొలి ఫలితం వెల్లడైంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మొదటి విజయం కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఫలితాలు మొదలైనప్పటి నుంచి మెజార్టీ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న హస్తం పార్టీ తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ 28358 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.









