ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఒక్క అవకాశమివ్వండి
ఎన్నికల ప్రచారంలో కంది సాయిమౌనారెడ్డి అభ్యర్థన
ఆదిలాబాద్ః విద్యావంతుడిగా తన భర్త కంది శ్రీనివాసరెడ్డికి ఒక విజన్ ఉందని, ఆదిలాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే సత్తా ఉందని, ఒక్క అవకాశమిచ్చి ఆశీర్వదించాలని ఆయన సతీమణి సాయిమౌనారెడ్డి అన్నారు. కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆమె తనదైనరీతిలో దూసుకెళ్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ ముందుకుసాగుతున్నారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ..వారి యోగా క్షేమాలు తెలుసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం రోజున ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణ్ వాడ, చించర్‌వాడ, ఫర్కోట, పంజేషా కాలనీలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.

ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, తన భర్త కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. ఆరు గ్యారంటీ హామీల కరపత్రాలను ఇంటింటికీ పంచుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటి అమలుకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో హస్తం పార్టీ చేతిగుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో మున్నాబాయ్, లత, ఐనేని స్వప్న,ముడుపు నళినీ రెడ్డి,శరణ్య రెడ్డి,అమీనా,జబీనా,అఖిల్ రెడ్డి,యెల్టీ అన్వేష్ రెడ్డి,మొహమ్మద్ వదూద్,షేక్ అహ్మద్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.










