AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇండియా ప్రపంచకప్ గెలిస్తే.. రూ.100 కోట్లు పంపిణీ

వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు కొన్నిగంటల ముందు ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక ఫైనల్ పోరులో భారత్ గెలవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఒకవేళ ఫైనల్లో భారత్ గెలిస్తే తమ కంపెనీ వినియోగదారులకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

క్రికెట్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ తుది సమరం అంగరంగ వైభవంగా జరగనుంది. ఫైనల్‌లో టీమిండియా గెలవాలని అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నారు. మరోవైపు టీమిండియా కచ్చితంగా విశ్వవిజేతగా నిలుస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు కొన్నిగంటల ముందు ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక ఫైనల్ పోరులో భారత్ గెలవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఒకవేళ ఫైనల్లో భారత్ గెలిస్తే తమ కంపెనీ వినియోగదారులకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ANN TOP 10