లక్ష్మీనరసింహ స్వామి కూడా కేసీఆర్‌కు వ్యతిరేకమే నని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. మరోసారి కేసీఆర్ గెలిస్తే దేవాలయ భూములను కూడా అమ్మేస్తాడన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ వంద కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. యాబై, అరవై సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వాలు గ్రామాల్లో ఇచ్చిన పేదలకు ఇచ్చిన భూములను గుంజుకోవడం తప్ప కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యమని ఈటల అన్నారు.
కేసీఆర్ అర చేతిలో వైకుంఠం చూపిస్తారు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. కేసీఆర్ పై ప్రజలు కసితో ఉన్నారన్నారు. కొత్తగా వచ్చిన తననే ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. తనకు భయపడి ఓటర్లకు మద్యం డబ్బులు విడతల వారీగా కేసీఆర్ పంపిణీ చేయనున్నాడని ఈటల రాజేందర్ ఆరోపించారు.









