వన్డే వరల్డ్‌కప్ తొలి సెమీఫైనల్లో ఇవాళ న్యూజిలాండ్‌తో టీమిండియా(Ind Vs Nz) తలపడనున్నది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో కాసేపట్లో ఆ మ్యాచ్ ప్రారంభంకానున్నది. ఇవాళ అక్కడ వెదర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రస్తుతం ముంబైలో వాతావరణం వేడిగా, పొడిగా ఉంది. వర్షం పడే అవకాశాలు శూన్యం. అయితే మధ్యాహ్నం వేళ వేడి ఎక్కువ ఉన్న కారణంగా.. ఇరు జట్లు ఆ హీట్‌ను తట్టుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రం టెంపరేచర్ 26 డిగ్రీలకు పడిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే ఛాన్సు ఉంది. మరో వైపు ముంబై పిచ్‌పై వివాదం చెలరేగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టోర్నీలో ఇప్పటి వరకు వాడిన పిచ్‌ను కాకుండా, మరో పిచ్‌ను వాడాలని ఇండియా కోరినట్లు ఓ మీడియాలో కథనం వచ్చింది. పేస్ బౌలర్ల సత్తాను దెబ్బతీసి, స్పిన్నర్లకు అనుకూలించే రీతిలో పిచ్‌ను తయారు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
2019 వరల్డ్‌కప్ సెమీస్‌లో కివీస్ చేతిలో ఇండియా ఓడింది. ఇక 2021 టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా ఇండియా ఓటమి చూవిచూసింది. కానీ తాజా టోర్నీలో మాత్రం రోహిత్ సేన టాప్ ఫామ్‌లో ఉంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లను గెలుచుకున్నది. బ్యాటర్లు, బౌలర్లు అందరూ రాణిస్తున్నారు. రసవత్తరంగా సాగే ఆ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.









