కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు నోటీసులు జారీ చేసింది. తమకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు అందించాలని ఈసీ ఈ నోటీసులు అందించింది. రేపు సాయంత్రం ఐదు గంటలలోపు పార్టీకి అందిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను సీల్డ్ కవర్‌లో అందించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులకు నోటీసులు పంపించింది. ఈ నెల 2వ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. తొలుత ఈ నెల 3వ తేదీన ఈసీ నోటీసులు జారీ చేసింది.









