AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదిలాబాద్ అభివృద్ధే శ్రీ‌నివాస‌రెడ్డి ల‌క్ష్యం

ఆయ‌న స‌తీమ‌ణి కంది సాయిమౌనారెడ్డి
కేఆర్‌కే కాల‌నీలో విస్తృతంగా ప్ర‌చారం
చెయ్యి గుర్తుకే ఓటువేసి గెలిపించాల‌ని విన్న‌పం

ఆదిలాబాద్ః వెనుకబాటుకు గురైన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కంది శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో అడుగుపెట్టార‌ని, సేవ చేయాల‌నే అమెరికాల‌ను వ‌దిలి ఆదిలాబాద్‌కు వ‌చ్చార‌ని ఆయ‌న స‌తీమ‌ణి కంది సాయి మౌనారెడ్డి అన్నారు. ప‌ట్ట‌ణంలోని కేఆర్‌కే కాల‌నీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల‌తో క‌లిసి త‌న భ‌ర్త‌, ఎమ్మెల్యే అభ్య‌ర్థి కంది శ్రీ‌నివాస‌రెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేప‌ట్టారు. ఇంటింటికీ తిరుగుతూ చెయ్యి గుర్తుకే ఓటు వేయాల‌ని, హ‌స్తం పార్టీని గెలిపించాల‌ని క్యాంపెయిన్ నిర్వ‌హించారు. పార్టీ ఆరు గ్యారంటీ హామీల‌కు సంబంధించిన క‌ర‌ప‌త్రాల‌ను పంపిణీ చేసి వాటిపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న కల్పించారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని, అంద‌రూ అప్ర‌త్తంగా ఉండి ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను తీసుకోవాల‌ని ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.


ఆదిలాబాద్‌లో మార్పు రావాలంటే త‌న భ‌ర్త‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటువేసి భారీ మెజార్టీతో కంది శ్రీ‌నివాస‌రెడ్డిని గెలిపించాల‌న్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా అంద‌రినీ ఆత్మీయంగా చిరున‌వ్వుతో ప‌ల‌క‌రిస్తూ ముందుకుసాగారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకెళ్లారు. అంద‌రి ఆశీర్వాదం త‌మ‌పై ఉండాల‌ని వేడుకున్నారు. ప్ర‌చారంలో భాగంగా కాల‌నీకి వ‌చ్చిన ఆమెకు కాల‌నీ మ‌హిళ‌లు నుదుట‌న తిల‌కం దిద్ది ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట డీసీసీబీ డైరెక్ట‌ర్‌ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు భరత్ వాగ్మారే, దుర్గం రాజేశ్వర్, ముడుపు నళినీరెడ్డి, సుజాత్ అలీ, కొండూరి రవి, దామోదర్, డేరా కృష్ణారెడ్డి, ముఖీమ్,బొట్టు సురేష్, జాకీర్,తైమూర్,అశోక్,క్రిష్ణ ,చంద్రశేఖర్ జుబేదా,ఆరీఫా,లత, ప్రమీల, రేణుక తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10