AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలతో లక్ష ఎకరాలకు సాగునీరు

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా శివన్నగూడ రిజర్వాయర్‌ నింపుతూ ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో గోసపడ్డ తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని మరోమారు బీఆర్‌ఎ్‌సకు అధికారమివ్వాలని ఆయన ప్రజలను కోరారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో మంగళవారం సాయంత్రం జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. రీజనల్‌ రింగు రోడ్డుతో ఈ నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటేసి ఆగం కావొద్దని, అభ్యర్థి, పార్టీ చరిత్ర చూసి ఓటెయ్యాలని ప్రజనీకాన్ని కోరారు. కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ కంపెనీలలో లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. సంక్షేమ పాలనకు చిరునామాగా నిలిచిన బీఆర్‌ఎస్‌కు మరోమారు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. కేవలం ఎన్నికల సమయంలో జనం ముందుకు వచ్చి మాయమాటలు చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ శంషాబాద్‌ నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా పెద్ద అంబర్‌పేట వరకు మెట్రోలైను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికంగా, విద్యాపరంగా అభివృద్ధ్ది చెందుతున్న ఈ ప్రాంతానికి మెట్రో అవసరమని అన్నారు. సాగర్‌ రహదారిని బీఎన్‌రెడ్డి నగర్‌ నుంచి మాల్‌ వరకు నాలుగు లేన్లుగా విస్తరించాల్సిందిగా సీఎంను కోరారు. మంచాల మండల పరిధి జాపాల్‌ – రంగాపూర్‌ నక్షత్రశాలకు సంబంధించి 200ఎకరాల్లో పీజీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు.

ANN TOP 10