AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పువ్వాడకు తుమ్మల స్ట్రాంగ్‌ కౌంటర్

మంత్రి పువ్వాడ అజయ్‌కు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ‘‘నేను చెల్లని రూపాయి కాదు డాలర్…..ఎక్కడైనా చెల్లుతా. డాలర్ కి ప్రపంచంలో ఏ దేశంలోనైనా విలువ. నీవు రద్దైన రెండు వేల నోటు నీ విలువ అది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడైనా పోటీ చేస్తానని.. ఖమ్మంలో పువ్వాడపై గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో భూ కబ్జాలు, అక్రమ కేసులు పెట్టించడం చేయలేదన్నారు. ప్రముఖ డాక్టర్ల భూములు కబ్జా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రఘునాథపాలెం మండలంలో లంబాడ సోదరుల భూములు, గుట్టలు కబ్జా చేశారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. అరాచకం లేని ఖమ్మం కోసం, ప్రశాంతమైన ఖమ్మం కోసం, అన్ని వర్గాలు సంతోషంగా ఉండే ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

ANN TOP 10