AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సర్పంచులు

ఖమ్మం : వైరా మండలంలో బీఆర్ఎస్ పార్టీకి పలువురు సర్పంచులు రాజీనామా చేశారు. వారంతా నేడు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. నేడు వైరా నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిటి కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నియోజకవర్గ అభ్యర్థి మాలోత్ రాందాస్ నాయక్ పాల్గొన్నారు. పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు సర్పంచులు చేరారు.

ANN TOP 10