AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల.. 12 స్థానాలకు అభ్యర్థులు ఖరారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మెుత్తం 12 మందితో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలోనూ సీనియర్ నేత విజయశాంతి పేరు లేదు. ఇక ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సుభాష్ రెడ్డి, చలమల కృష్ణారెడ్డిలకు టికెట్లు కేటాయించారు. ఇక తొలి మూడు జాబితాల్లో 88 మందికి చోటు కల్పించగా.. ఇవాళ విడుదలైన జాబితా కలిపి 100 మందిని ఎంపిక చేశారు.

మరో 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. జనసేనతో బీజేపీకి పొత్తు కుదిరింది. ఆ పార్టీకి 8-9 స్థానాలు కేటాయిస్తారనే ప్రచారం జరగుతుండగా.. ఆ సీట్ల పంపకాల అంశం కొలిక్కి వచ్చాక మిగిలిన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా..
చెన్నూరు- దుర్గం అశోక్‌
ములుగు- అజ్మీరా ప్రహ్లాద్‌ నాయక్‌
వేములవాడ- తుల ఉమ
ఎల్లారెడ్డి- సుభాష్‌రెడ్డి
హుస్నాబాద్‌-బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి
సిద్దిపేట- దూది శ్రీకాంత్‌రెడ్డి
వికారాబాద్‌- పెద్దింటి నవీన్‌కుమార్‌
గద్వాల్‌- బోయ శివ
మిర్యాలగూడ- సాధినేని శివ
మునుగోడు-చల్లమల్ల కృష్ణారెడ్డి
నకిరేకల్‌-మొగులయ్య
కొడంగల్‌- బంటు రమేశ్‌కుమార్‌

ANN TOP 10