AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడే మోదీ బీసీ గర్జన సభ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాకతో నేడు హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజ్ భవన్, ఎల్బీస్టేడియం సభ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా ఉన్నతాధికారుల సూచనలతో ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్ లను మూసివేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అధికారులు నిర్ణయం తీసుకుంది. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5: 25 నుంచి 6: 15 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు.

ANN TOP 10