నేటి నియోజకవర్గాల పర్యటనలో భాగంగా దేవకద్రకు వ్యవసాయ క్షేత్రం నుంచి వాయుమార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్ మార్గమధ్యం నుంచి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్ ను మళ్లించి సురక్షితంగా లాండింగ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్ ను ఏవియేషన్ సంస్థ వారు ఏర్పాటు చేయనున్నారు. మరి కాసేపట్లో హెలికాప్టర్ రాగానే బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గారు నేటి పర్యటనను యథావిధిగా కొనసాగించనున్నారు.









