AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో 90 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రపంచంలో తనను కొనే శక్తి ఎవరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. గత మునుగోడు ఉప ఎన్నికల్లో నైతిక విజయం తనదేనన్నారు. గజ్వేల్లో పోటీ చేస్తానని ఏఐసిసికి చెప్పానని, నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానమేనని ఆయన తెలిపారు. ఏదీఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవడం ఈసారి ఎవరి వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు.

ANN TOP 10