చిత్తూరు జిల్లాలో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఓ ప్రధాన ఉపాధ్యాయుడుని సస్పెండ్ చేయగా, 22 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఈఓ విజేందర్ రావు తెలిపారు. ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గంగవరం మండలం కీలపట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల వసతీ గృహాల వద్దకు వెళ్లి పుస్తకాలు పరిశీలించగా సిలబస్ పూర్తి కాలేదని గుర్తించిన నేపథ్యంలో అక్కడి ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డిని ఆర్జెడి వెంకటకృష్ణారెడ్డి సస్పెండ్ చేశారని చెప్పారు.
కీలపట్ల ప్రాథమిక పాఠశాల హెచ్ఎం దామోదర్ ను విధుల నుంచి తాత్కాలింగా తొలగించి అక్కడే పనిచేస్తున్న తేజోవతి తులసీనాతం నాయుడు ,భాస్కర్ యొక్క షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నగరి మండలం ఏకాంబర కుప్పం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకంలో అలసత్వం ప్రదర్శించిన ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేష్ తో పాటు మరో 16 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. అదే మండలం పూజిపేట జడ్పీ ఉన్నత పాఠశాల ఇంగ్లీషు ఉపాధ్యాయుడు బాలాజీ విద్యార్థులకు ఆ సబ్జెక్టులో చదవడం ,నేర్పించడంలో విఫలమైనందుకు సంజాయిషీ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.









