AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరొ వ్యక్తి అరెస్ట్‌

తెలంగాణలో టీఎస్పీఎస్సీ ( TSPSC ) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తాజాగా మరొకరిని అరెస్ట్‌ చేశారు. న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తిని నగర సీసీఎస్‌/సిట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఇప్పటి వరకూ ఈ కేసులో 100 మంది అరెస్ట్‌ అయినట్లు సిట్ అధికారులు తెలిపారు. సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన వారిలో అధిక మంది విద్యార్థులే ఉండటం గమనార్హం. వీరందరిపై ఐపీసీలోని 381, 409, 420, 411, 120 (బీ), 201తో పాటు ఐటీ యాక్ట్‌( IT ACT, 2000 ) లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ANN TOP 10