AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సమఉజ్జీల పోరుకు రంగం సిద్ధం.. నేడు దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీ

వరల్డ్ కప్ 2023లో ఈరోజు ఒక ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్, థెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు చాలా ప్రత్యేకం. నవంబర్ 5 భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు. కోహ్లీకి 35 ఏళ్లు నిండినందున అతని పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు CAB ఇప్పటికే సిద్ధమైంది. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కోహ్లీకి విజయాన్ని కానుకగా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ఈ ప్రపంచకప్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. అలాగే ఆఫ్రికా ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింటిలో విజయం సాధించి రెండో స్థానంలో ఉంది. అందువల్ల భారత్‌కు ఈ మ్యాచ్ అంతే తేలికైన సవాలు కాదు. టీమ్ ఇండియాకు విజయం కూడా ముఖ్యమైనదే. కోహ్లీకి పుట్టినరోజుకు విజయంతో కానుక ఇవ్వాలని రోహిత్ శర్మ ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఇండియా విషయానికొస్తే, ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ తోపాటు వన్డౌన్ లో వచ్చే కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండటం కలిసొచ్చే అంశం. రోహిత్ శర్మ చెలరేగితే, అడ్డుకోవడం ఎంతటి ప్రత్యర్థికైనా కష్టమే. ఇప్పటివరకూ శ్రేయస్, సూర్యకుమార్ ల ఫామ్ పై అనుమానం ఉన్నా, మొన్న ఇంగ్లండ్ పై జరిగిన మ్యాచ్ లో ఇద్దరూ అదరగొట్టారు. బౌలింగ్ విషయానికొస్తే, ఇండియాకు పేసర్లు కొండంత అండగా నిలుస్తున్నారు. షమీ, సిరాజ్ వికెట్లు తీస్తుంటే, బుమ్రా అద్భుతంగా బాల్స్ వేస్తూ పరుగులు కట్టడి చేస్తున్నాడు. దక్షిణాఫ్రికా జట్టులో కొయెట్జీ, జాన్సన్ లు కత్తుల్లాంటి బంతులు విసురుతూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. భారతీయ పిచ్ లపై స్పిన్నర్ కేశవ్ మహరాజ్ సత్తా చూపిస్తున్నాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్, రవీంద్ర జడేజా, కుల్ దీప్, బుమ్రా, షమి, సిరాజ్.

దక్షిణాఫ్రికా జట్టు: బవుమా (కెప్టెన్), డికాక్, డసెన్, మార్ క్రమ్, క్లాసెన్, మిల్లర్, జాన్సన్, కేశవ్ మహరాజ్, కొయెట్జీ, రబడా, ఎంగిడి.

ANN TOP 10