AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైఎస్సార్‌టీపీకి బైనాక్యులర్‌ గుర్తు.. కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం

అసెంబ్లీ ఎన్నికలతో తొలిసారి బరిలోకి దిగుతున్న వైఎస్ షర్మిలారెడ్డి పార్టీ వైఎస్సార్‌టీపీకి తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తు కేటాయించింది. ఈ మేరకు బైనాక్యులర్‌ గుర్తును ఫిక్స్‌ చేసింది. 119 నియోజకవర్గాల్లో ఒకే గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైఎస్ఆర్‌టీపీ కూడా అభ్యర్థులను ప్రకటించి తమ బైనాక్యులర్ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమయ్యారు.

2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైఎస్ షర్మిలా రెడ్డి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీలో అన్న వైఎస్ జగన్‌తో విభేదాలు రావడంతో ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ)ని ప్రకటించి ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు. తెలంగాణలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తొలి భారతీయ మహిళగా షర్మిల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చేరారు. కాగా తాను స్థాపించిన వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు వైఎస్ షర్మిలారెడ్డి విశ్వప్రయత్నాలు చేశారు. ఈ మేరకు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీలతో మంతనాలు జరిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనానికి సంబంధించి దాదాపు నాలుగు నెలల పాటు ఎదురుచూసినా కాంగ్రెస్ నుంచి షర్మిలకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో ఒంటరిగానే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు షర్మిల సిద్ధమయ్యారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ANN TOP 10