AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హుజురాబాద్ ప్రచార బాధ్యతలు జమునారెడ్డికి..

మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్.. రెండు చోట్లు పోటీ చేస్తున్నారు. ఒక్కటి.. సొంత నియోజకవర్గం హుజురాబాద్ కాగా, మరొక్కటి సీఎం కేసీఆర్ ప్రాతినథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం. అయితే.. హుజురాబాద్ నుంచి వరుసగా విజయం సాధిస్తు వస్తున్నారు. మొదటిసారిగా, హుజురాబాద్‌తో పాటు మరో నియోజకవర్గంలో పోటీకి దిగుతున్నారు ఈటల. సీఎం కేసీఆర్ పోటీ చేసే.. గజ్వేల్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్‌లో ఎవరు ప్రచారం నిర్వహిస్తారనే చర్చ సాగుతుంది. అయితే ఆయన సతీమణి జమునా రెడ్డి ఈటెల ప్రచార బాధ్యతలు తీసుకోనున్నారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజవర్గం నుంచీ మరోసారి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఆయన.. ఇక్కడ ఓటమి లేకుండా, విజయం సాధిస్తూ వస్తున్నారు. మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటారు. అయితే, ఈటలతో పాటు.. ఆయన సతీమణి జమునా రెడ్డి.. ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. సుమారుగా మూడు నెలల పాటు. ప్రచారం చేసి. వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈటలకు ప్రాణహానీ ఉందనే విషయాన్ని కూడా జనం దృష్టికి తీసుకువచ్చారు.

అ క్రమంలోనే పూర్తిగా హుజురాబాద్ ఎన్నికల బాధ్యతను జమునా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజేందర్ ఎక్కువగా గజ్వేల్‌పై దృష్టి పెట్టుకున్నారు. అక్కడ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాననే ఇది వరకు ప్రకటించారు. ఇటీవల హుజురాబాద్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో కూడా నేతలు, కార్యకర్తలు కథ నాయకుడిగా పని చేయాలంటూ పిలుపునిచ్చారు. దీంతో కేడర్‌ను సమన్వయం చేసే బాధ్యతలను జమునా తీసుకుంటున్నారు. పూర్తి బాధ్యతలు జమునా రెడ్డి తీసుకొని ప్రచార పర్వంలో అడుగు పెడుతుండటంతో గెలుపోటములు ఆసక్తికరంగా మారాయి.

ANN TOP 10