తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితా నేడు (గురువారం) విడుదల కానుంది. 40 మంది అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మిగిలిన 24 స్థానాల అభ్యర్థులను నేడు ఫైనల్ చేయనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ బుధవారం మూడున్నర గంటలపాటు అభ్యర్థుల జాబితాపై తీవ్ర కసరత్తు చేసింది.
సుమారు 40 స్థానాల అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చింది. 40కిపైగా స్థానాలకు అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేసింది. మిగతా స్థానాలపై చర్చించేందుకు నేడు మరోసారి భేటీ కానున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ వేణుగోపాల్ తో టీకాంగ్రెస్ సమావేశం అయ్యారు. సీఈసీ భేటీకి సంబంధించి చర్చించనున్నారు.









