AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. రెండు జట్లలో కీలక మార్పులు..

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 (ICC World Cup 2023)లో మరో ప్రతిష్టాత్మక పోరుకు రంగం సిద్ధమైంది. ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ (SA vs NED) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాసేపట్లో జరగనున్న ఈ పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది సౌతాఫ్రికా. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యమైంది. దీంతో.. టాస్ ఆలస్యమైంది. మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక.. సౌతాఫ్రికా జట్టు ఒక కీలక మార్పు చేసింది. షంసీ స్థానంలో గెరాల్డ్ కోయెట్జీ తుది జట్టులోకి వచ్చాడు. ఇక.. నెదర్లాండ్స్ జట్టు కూడా ఒక కీలక మార్పు చేసింది. ర్యాన్ క్లెన్ స్థానంలో లోగాన్ వాన్ బీక్ జట్టులోకి వచ్చాడు.

ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్న సౌతాఫ్రికా జట్టు.. మూడో గేమ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీకొట్టబోతోంది. ఇప్పటికే నెదర్లాండ్స్ రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి.. మూడో గేమ్‍‌లోనైనా విజయాల ఖాతా తెరవాలని డచ్ టీం భావిస్తుంది.తొలి మ్యాచ్‌లో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 102 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. తర్వాత లక్నోలో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా మట్టి కరిపించింది. అయితే, గతేడాది జరిగిన ICC T20 ప్రపంచకప్‌లో మాత్రం సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ మట్టికరిపించింది.

సౌతాఫ్రికా టీమ్ ఈ మెగాటోర్నీలో సూపర్ ఫామ్ లో ఉంది. ఆ జట్టులోని ఆటగాళ్లు అందరూ సమిష్టిగా రాణిస్తున్నారు. బ్యాటింగ్ లో డికాక్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కెప్టెన్ బవుమా, మార్కరమ్, వాన్ డర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఈ ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు. వీరందరూ ధనాధన్ ఆటతో అదరగొడుతున్నారు. బౌలింగ్ విభాగంలో కగిసో రబాడా, మార్కో జాన్సెస్, లుంగి ఎన్గిడి నిప్పులు చెరుగుతున్నారు. స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, షంసీ కూడా వారి విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు.

ANN TOP 10