AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

62 మంది పేర్లతో కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్టు రెడీ.. ! ఎవరెవరు ఉన్నారంటే..!

సోషల్ మీడియాలో లిస్టు చక్కర్లు
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన గెలుపుగుర్రాల లిస్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అధికారంగా ప్రకటించడమే మిగిలింది. అయితే.. అంతకు ముందే ఓ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఈ లిస్టులో 62 మంది అభ్యర్థుల పేర్లు ఉండగా.. అందులో చాలా వరకు సీనియర్ నేతలు ఉండటం గమనార్హం. అయితే.. ఇప్పటివరకు ఒకే కుటుంబం నుంచి ఇద్దరిని ఛాన్స్ ఇవ్వకూడదంటూ టికెట్ల పంచాయితీ నడుస్తుండగా.. ఈ లిస్టులో మాత్రం ఒకే కుటుంబం నుంచి ఇద్దరి పేర్లు ఉన్నాయి. ఉత్తమ్ దంపతులతో పాటు మైనంపల్లి తండ్రీకొడుకులకు రెండు చోట్ల నుంచి టికెట్లు ఇచ్చినట్టు ఈ లిస్టులో ఉంది. అయితే.. ఈ లిస్టు ఎంత వరకు అధికారికమైనదో కాదో తెలియదు కానీ.. సీనియర్లందరితో పాటు ఈ మధ్యే కాంగ్రెస్‌లో చేరిన అభ్యర్థులందరికీ.. తాము కోరుకున్న స్థానాల నుంచే అవకాశం కల్పించినట్టుగా ఉంది. మరి ఈ లిస్ట్ ఎంత వరకు నిజమో.. అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

లిస్టులో ఎవరెవరున్నారంటే..
1. కొడంగల్‌ : రేవంత్‌రెడ్డి
2. మధిర : భట్టివిక్రమార్క
3. హుజూర్‌నగర్‌ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
4. నల్లగొండ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
5. మంథని : శ్రీధర్‌బాబు
6. సంగారెడ్డి : జగ్గారెడ్డి
7. భద్రాచలం : పొదెం వీరయ్య
8. ములుగు : సీతక్క
9. జగిత్యాల : జీవన్‌రెడ్డి
10. కొత్తగూడెం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
11. పాలేరు : తుమ్మల నాగేశ్వర్‌రావు
12. నాగార్జున సాగర్‌ : జానారెడ్డి
13. కోదాడ : పద్మావతి రెడ్డి

14. నకిరేకల్‌ : వేముల వీరేశం
15. భువనగిరి: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
16. వరంగల్‌ ఈస్ట్‌ : కొండా సురేఖ
17. భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణ
18. వర్థన్నపేట : కేఆర్‌ నాగరాజు
19. పాలకుర్తి : ఝాన్సీరెడ్డి
20. నర్సంపేట : దొంతి మాధవరెడ్డి
21. మంచిర్యాల : కొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌రావు
22. ఆదిలాబాద్‌ : కంది శ్రీనివాస్ రెడ్డి
23. ఆసిఫాబాద్‌ : శ్యామ్‌నాయక్‌
24. చెన్నూరు: నల్లాల ఓదెలు
25. ముథోల్‌ : డాక్టర్‌ కిరణ్‌కుమార్‌
26. సిర్పూర్‌ : రావి శ్రీనివాస్‌
27. నిర్మల్‌ : కూచాడి శ్రీహరిరావు
28. బెల్లంపల్లి : గడ్డం వినోద్‌కుమార్‌
29. వేములవాడ : ఆది శ్రీనివాస్‌
30. కోరుట్ల : జువ్వాడి నర్సింగరావు
31. సిరిసిల్ల : కేకే మహేందర్‌రెడ్డి

32. మానకొండూరు : కవ్వంపల్లి సత్యనారాయణ
33. పెద్దపల్లి : విజయ రమణారావు
34. కామారెడ్డి : షబ్బీర్‌ అలీ
35. బాల్కొండ : సునీల్‌ రెడ్డి
36. నిజామాబాద్‌ అర్బన్‌: ధర్మపురి సంజయ్‌
37. బోధన్‌ : సుదర్శన్‌రెడ్డి
38. ఎల్లారెడ్డి : మదన్‌మోహన్‌రావు
39. బాన్సువాడ : సుభాష్ రెడ్డి
40. ధర్మపురి : అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌
41. జహీరాబాద్‌ : ఎ.చంద్రశేఖర్‌
42. అందోల్‌ : దామోదర రాజనర్సింహ
43. మెదక్‌ : మైనంపల్లి రోహిత్‌రావు
44. గజ్వేల్‌ : నర్సారెడ్డి
45. తాండూరు : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
46. పరిగి : రామ్మోహన్‌ రెడ్డి
47. వికారాబాద్‌ : గడ్డం ప్రసాద్‌కుమార్‌
48. శేరి లింగంపల్లి: ఎం.రఘునాథ యాదవ్‌
49. మల్కాజిగిరి : మైనంపల్లి హన్మంతరావు

50. ఇబ్రహీంపట్నం : మల్‌రెడ్డి రంగారెడ్డి
51. నాంపల్లి : ఫిరోజ్‌ఖాన్‌
52. షాద్‌నగర్‌ : వీరవల్లి శంకర్‌
53. కొల్లాపూర్‌ : జూపల్లి కృష్ణారావు
54. అచ్చంపేట : వంశీకృష్ణ
55. అలంపూర్‌ : సంపత్‌కుమార్‌
56. కల్వకుర్తి : కసిరెడ్డి నారాయణరెడ్డి
57. నాగర్‌ కర్నూల్‌ : కూచకుళ్ల రాజేష్ రెడ్డి
58. నారాయణపేట : ఎర్ర శేఖర్‌
59. మహబూబ్‌నగర్‌ : యెన్నం శ్రీనివా్‌సరెడ్డి
60. గద్వాల్‌ : సరితా తిరుపతయ్య
61. జడ్చర్ల : అనిరుధ్‌రెడ్డి
62. ఆలేరు : ఐలయ్య

ANN TOP 10