టాలీవుడ్ నటుడు నవదీప్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ కోసం ఈనెల 10న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు డ్రగ్స్ కన్జ్యూమర్ గా పేర్కొన్న నేపథ్యంలో ఓ సారి నార్కోటిక్ బ్యూరో విచారణ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. 10తేదీన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. నవదీప్ కు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ తో సంబంధాలున్నట్లుగా నార్కోటిక్ బ్యూరో విచారణలో గుర్తించింది.
కాగా గత నెలలో నగరంలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు మాదాపూర్ పోలీసులతో కలిసి డ్రగ్స్ సరఫరా విషయాలో ఆపరేషన్ నిర్వహించారు. దీంట్లో భాగంగా పలువురుని అదుపులోకి తీసుకన్నారు. వీరిలో నైజీరియాకు చెందిన వ్యక్తులతో పాటు ఓ దర్శకుడు, మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.వీరి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసినవారిని విచారించగా నటుడు నవదీప్ కు వారితో సంప్రదిపులు జరిపినట్లుగా తెలుసుకున్నారు. దీంతో నవదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే హీరో నవదీప్ ను పోలీసులు విచారించారు. ఈక్రమంలో మరోసారి నోటీసులు జారీ చేయటంతో పాటు అక్టోబర్ 10న విచారణకు రావాలని ఆదేశించారు.









