AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం కేసీఆర్‌కు మరో ఇన్ఫెక్షన్.. సమయం పట్టొచ్చు: కేటీఆర్

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. కేసీఆర్‌కు ఛాతీలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. ఇప్పటికే ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. శుక్రవారం (అక్టోబర్ 6) మధ్యాహ్నం ఇంగ్లిష్ టీవీ ఛానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ కేటీఆర్ ఈ విషయం వెల్లడించారు.

వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. వైద్యులు ఆయనకు ప్రగతి భవన్‌లో చికిత్స అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారని, ప్రగతి భవన్‌లో ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సెప్టెంబర్ 26న కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారం రోజులుగా జ్వరం, దగ్గు సమస్యలతో కేసీఆర్ బాధపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని డాక్టర్ల బృందం చెప్పినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

ANN TOP 10