AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ ఏమన్నా బాహుబలినా?

తెలంగాణలో బిల్లా, రంగాలు తిరుగుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. చిత్త కార్తె కుక్కల్లా తిరుగుతున్నారన్నారు. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును కాంగ్రెస్ మంత్రిని చేసిందని గుర్తుచేశారు. రబ్బరు చెప్పులు వేసుకునే హరీష్ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. ‘‘మమ్మల్ని మరుగుజ్జులు అంటారా.. కేసీఆర్ (CM KCR) ఏమన్నా బాహుబలి నా.. అద్దంలో ముఖం చూసుకోవాలి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో అమలు చేస్తున్న పథకాలు తెలంగాణలో అంతటా ఎందుకు అమలు చెయ్యరని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చామని.. అవి నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ANN TOP 10