AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నా అడ్డాలో ఎలా గెలుస్తారో చూస్తా

ఖానాపూర్‌లో బీఆర్ఎస్ ఎలా గెలుస్తుందో చూస్తానని ఎమ్మెల్యే రేఖానాయక్ (Rekha nayak) శపథం చేశారు. ఖానాపూర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేటీఆర్ ఫ్రెండ్ కోసం తనకు టికెట్ ఇవ్వలేదని వాపోయారు. నేనేంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని హెచ్చరించారు. అయినా నేనేం తప్పు చేశానంటూ నిలదీశారు. ఏమైనా కుంభకోణాలు చేశానా? అని ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు నిధులు కూడా ఇవ్వలేదని వాపోయారు. ఎస్టీ నియోజకవర్గంపై వివక్ష చూపారని రేఖానాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా బీఆర్ఎస్‌లో మహిళలకు విలువ లేదని ఆమె కంటతడి పెట్టారు. ఒంటరిగా పోటీ చేసి బీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతానన్నారు. ఖానాపూర్ అడ్డా.. రేఖానాయక్ అడ్డా అని వ్యాఖ్యానించారు. ఖానాపూర్‌లో మరో నేతను గెలవనివ్వకుండా చూస్తానని రేఖానాయక్ స్పష్టం చేశారు.

ANN TOP 10