AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో కాంగ్రెస్ దే విజయం.. రెండో స్థానంలో బీఆర్ఎస్: లోక్ పోల్ సర్వే

కాంగ్రెస్ 61 నుంచి 67 సీట్లు..
45 నుంచి 51 స్థానాల్లో బీఆర్ఎస్ ..
బీజేపీ 2 నుంచి 3 స్థానాలకే పరిమితమవుతుందన్న లోక్ పోల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రెండు, మూడు రోజుల్లో ఎలెక్షన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్ పోల్ సంస్థ నిర్వహించిన సర్వే తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించబోతోందని సర్వేలో తేలింది. మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ కు 61 నుంచి 67 సీట్లు వస్తాయని లోక్ పోల్ సర్వే తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ 45 నుంచి 51 స్థానాల్లో మాత్రమే గెలుపొంది రెండో స్థానానికి పరిమితమవుతుందని వెల్లడించింది. ఎంఐఎం 6 నుంచి 8 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బీజేపీ 2 నుంచి 3 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. ఇతరులు సున్నా లేదా ఒక్క స్థానాన్ని గెలుచుకోవచ్చని తెలిపింది.

ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఈ సర్వేను నిర్వహించినట్టు లోక్ పోల్ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ సర్వే నిర్వహించినట్టు తెలిపింది. సర్వే శాంపిల్ సైజ్ 60 వేలు అని పేర్కొంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లోనూ లోక్‌పాల్‌ సర్వే ఖచ్చితమైన ఫలితాలను వెల్లడించింది.

ANN TOP 10