AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో బడా వ్యాపారవేత్తల ఇళ్లలో ఐటీ సోదాలు

హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా ఐటీ అధికారులు 100 టీములతో సోదాలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కంపెనీలతోపాటు వ్యక్తుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అలాగే జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ సోదరుల నివాసంతో పాటు వ్యాపారవేత్తలు ప్రసాద్‌, కోటేశ్వరరావు, రఘ్‌వీర్‌ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ANN TOP 10