భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి పేరిట సుదర్శన హోమాన్ని తెలుగుదేశం నాయకులు నిర్వహించారు. జాతక, గోచార రీత్యా చంద్రబాబు బాగుండాలని, ఆయన కుటుంబం సుభిక్షంగా ఉండాలని, మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ హోమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సమయంలో విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, అగ్నిప్రతిష్ట, హోమం, ప్రసాద నివేదన జరిపారు. ఈ కార్యక్రమం ఏపీ రాష్ట్ర తెలుగుయువత ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు ఆధ్వర్యంలో నిర్వహించారు.









