AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భార్య తిట్టిందని.. ఓ భర్త నడిరోడ్డుపై..

ఫుల్లుగా మందు కొట్టాడు. నడి ఊర్లోకి వచ్చాడు. గాంధీ విగ్రహం సాక్షిగా బలన్మరణానికి పాల్పడబోయాడు. వందలాది మంది ఆ దారి వెంట పోతున్నా ఏ ఒక్కరూ ఆపిన దాఖలాలు లేవు. చివరకు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి అతని ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కు చెందిన గడిపెళ్లి మల్లేశం అనే వ్యక్తి గాంధీ విగ్రహం వద్ద ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎంటి అని మల్లేశంను వివరణ అడుగగా షాకింగ్ కారణం చెప్పాడు. ఇంట్లో తనను తన భార్య మందలించిందని, ఆ అవమానం తట్టుకోలేక పోతున్నాని అన్నాను. ఇక తాను బ్రతికి వెస్ట్ అని, తనను చావనివ్వండి అంటూ హల్‌చల్ చేశాడు. హోంగార్డ్ మల్లేశంను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు. తాగిన మైకంలో ఉన్నట్లు గుర్తించారు. మత్తు దిగిన తరువాత.. కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

ANN TOP 10