AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ 9కి వాయిదా

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను రోజు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై రోహాత్గీ స్పందిస్తూ, అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. మరోవైపు, చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, తాము మొత్తం వివరాలతో సిద్ధంగా ఉన్నామని సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ కూడా వాదనలు వినిపించారు. బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని ఏపీ సీఐడీ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆరోపణలు చేశారు.

ఈ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేస్తున్నామని.. ఇరుపక్షాలు అప్పుడు డాక్యుమెంట్లు అన్నీ సమర్పించాలన్నారు. కేవియట్‌ పిటిషన్‌ వేసిన రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలకు మద్ధతిచ్చే డాక్యుమెంట్లు సమర్పించాలి. దర్యాప్తు ముందే ప్రారంభమైందని నిరూపించాలి అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నారని లూథ్రా ప్రస్తావించగా.. వీళ్లు కనీసం బెయిల్‌ అడగడం లేదు, ఏకంగా కేసును కొట్టేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ వేశారని రోహత్గి అన్నారు. ఇప్పుడు చంద్రబాబును పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని అడుగుతున్నారని.. బుధవారం బెయిల్‌ పిటిషన్‌ లిస్టైంది అన్నారు. అయితే బెయిల్ పిటిషన్ సంగతి చూడాలని ఈ నెల 9కి విచారణ వాయిదా వేశారు.

ANN TOP 10