AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టాలెంట్‌ ఎందుకు..? ఆ పనిచేస్తే చాలు.. పాయల్ షాకింగ్ కామెంట్స్‌

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటినుంచో హాట్ ఇష్యూ. టాలెంట్ సంగతి పక్కనబెట్టి మహిళలను లైంగికంగా వాడుకుంటూ సినిమా ఆఫర్స్ ఇస్తున్నారంటూ ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఓపెన్ అయ్యారు. దీనిపై క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ పెద్ద పెద్ద ఉద్యమాలే లేవనెత్తారు కూడా. ఇదే బాటలో తాజాగా నటి పాయల్ ఘోష్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. అవకాశం రావాలంటే టాలెంట్‌తో పనేంటి..? బట్టలిప్పితే చాలు అన్నట్లుగా ఆమె చేసిన ట్వీట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

అయితే ఎక్కువగా బాలీవుడ్ వర్గాలపై విరుచుకుపడే పాయల్ ఘోష్.. గతంలోనే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై సంచనల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బాలీవుడ్ వర్గాలపై సంచలన వ్యాఖ్యలతో ట్వీట్ పెట్టింది పాయల్ ఘోష్. ”నేను సౌత్ సినిమాతో ఆరంగేట్రం చేశాను కాబట్టి సేఫ్ అయ్యాను.. అదే బాలీవుడ్ లో అయితే బట్టలిప్పేసేవారు చూపించడానికి, అక్కడ క్రియేటివిటీ కంటే ఎక్కువగా అమ్మాయిల అవయవ సౌందర్యం మీదే దృష్టి పెడతారు” అని పాయల్ ఓపెన్ గా చెప్పేసింది. దీంతో ఆమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపింది.

ANN TOP 10