AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం పక్కా

ఓటమికి భయపడే ఉచితాలకు రెడీ అవుతున్న బీఆర్‌ఎస్‌
పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.ఎన్టీఆర్‌ పేరు నా పేరు ఒక్కటే అని కేటీఆర్‌ మురిసిపోతున్నారని..ఎన్టీఆర్‌ కి కేటీఆర్‌ కి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది అంటూ సెటైర్లు వేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావటం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్న రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. దీంట్లో భాగంగానే కాంగ్రెస్‌ విజయాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు అన్నారు.

కేటీఆర్‌ వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తు.. బీఆర్‌ఎస్‌ ఓట్ల కోసం ఎన్టీఆర్‌ ని వాడుకుంటుందని..ఎన్టీఆర్‌ సమాధిని తొలగించాలని చూసింది కేసీఆర్‌ అంటూ ఆరోపించారు. డోమస్టిక్‌ ఎయిర్‌ లైన్స్‌ కి ఎన్టీఆర్‌ పేరు తొలగించి అవమానించారని అన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్‌ పేరును వాడుకుంటోంది అంటూ మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కు 25 సీట్లు దాటే ఛాన్స్‌ లేదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ గెలుస్తుందనే భయంతోనే బీఆర్‌ఎస్‌ ఉచితాలు ప్రకటించేస్తోందని..ఆ భయంతోనే ఉచిత సిలిండర్లు, సన్న బియ్యం రేషన్‌ , రైతు లకు పెన్షన్‌ లాంటి హామీ లు ఇచ్చేందుకు కేసీఆర్‌ సిద్ధం అవుతున్నారని విమర్శించారు.

ANN TOP 10