AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫ్యాన్సీ నంబర్లా? మజాకా?.. ఏకంగా రూ.54 కోట్లు!

ఫ్యాన్సీ నెంబర్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. తెలంగాణలో కొత్తగా కొనుగోలు చేస్తున్న కార్లు, బైక్‌లకు లక్కీ నెంబర్, ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా తెలంగాణ(Telangana) రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ(RTA)కి ఆదాయం కోట్లలో వచ్చి పడుతోంది. ముఖ్యంగా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా ఆర్టీఏకి గత మూడేళ్లుగా వచ్చిన ఆదాయం వివరాలు చూసుకుంటే ఇప్పటి వరకు ఒక లెక్కా ..గడిచిన 9నెలలు మరో లెక్క అన్నట్లుగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధితో పాటు జంటనగరాల ఆర్టీఏ కార్యాలయాల్లో ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్ డ్రైవ్‌కి విశేష స్పందన లభించింది. కేవలం 9నెలల్లో 54కోట్ల రూపాయల (54Crore)ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. గత మూడేళ్లుగా చూసుకుంటే ఈ ఆదాయం రెట్టింపు అయినట్లుగా కనిపిస్తోంది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కార్లకు ఆల్ నైన్స్(9999) అలాగే 0007(జేమ్స్‌బాండ్ నంబర్‌)అలాగే ఆల్‌ వన్స్(1111)వీటితో పాటు అనే రకాలుగా ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు లక్షలు చెల్లించుకున్నారు. అందుకే 9నెలల కాలంలో ఆర్టీఏ ఆదాయం 54కోట్లకు చేరుకుంది. గ్రేటర్ పరిధిలోని అన్నీ ఆర్టీఏ కార్యాలయాలతో పోలిస్తే ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీస్‌ పెద్ద మొత్తంలో ఆదాయం గడించింది. ఆగస్ట్ నెలలో కేవలం ఒక్క 9999 నంబర్ కోసం 21.6లక్షల ఆదాయం వచ్చింది. ఇక తర్వాత స్థానంలో కొండాపూర్ ఆర్టీఏ ఉంది. ఇక్కడ కూడా 9999నెంబర్‌కి 12.1లక్ష రూపాయలు పలికింది. మలక్‌పేటలోని ఆఫీస్‌లో 9.9 లక్షలు చెల్లించి 9999 నంబర్ దక్కించుకున్నారు వాహనదారులు.

మొత్తంగా చూసుకుంటే గతేడాది మొత్తంలో ఫ్యాన్సీ నంబర్ల డ్రైవ్ ద్వారా 72.2 కోట్ల రూపాయల ఆదాయం ఆర్టీఏకు వస్తే ..ఈ ఏడాది 9 నెలలకు 54కోట్ల రూపాయలు వచ్చింది. అంటే మరో మూడు నెలల్లో గతేడాది ఆదాయాన్ని అధిగమిస్తుందంటున్నారు అధికారులు.

ANN TOP 10