కుక్కర్ల పంపిణీ కార్యక్రమంలో కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం
వాడవాడలా జనం నీరాజనం, అందిస్తున్న సేవలపై హర్షం
ఎమ్మెల్యే జోగు రామన్న వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజం
ఆదిలాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన గ్యారంటీ హామీలన్నింటినీ పక్కాగా అమలు చేస్తామని ఎన్నారై, కేఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్‌నగర్, పిట్టలవాడ, ఇందిరమ్మ కాలనీ, తిర్పెల్లి వార్డులో కేఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ప్రెషర్ కుక్కర్ల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కంది శ్రీనివాసరెడ్డికి పార్టీ శ్రేణులు, కాలనీవాసులు టపాసులు కాల్చి డప్పుచప్పుళ్ల మధ్య అపూర్వ స్వాగతం పలికారు. శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

అనంతరం మహిళలను తన తోబుట్టువులుగా భావించి వారికి ప్రెషర్ కుక్కర్లను చిరు కానుకలుగా ఆయన అందజేశారు. ఆయన అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు మహిళలు ప్రశంసించారు.వృద్ధ మహిళలు కంది శ్రీనివాసరెడ్డిని నిండూ నూరేళ్లు చల్లగా ఉండాలంటూ దీవించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తెలంగాణలో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఇటీవల ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ గ్యారంటీ హామీలను ప్రవేశపెట్టారన్నారు. వాటిని అమలు చేసి ప్రజల కళ్లల్లో మళ్లీ ఆనందం చూస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ఇచ్చిన హామీలను విస్మరించి 15 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఒక మంచి ఆలోచనతో కుక్కర్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడితే అధికారాన్ని ఉపయోగించుకుని రామన్న అడుగడుగునా అడ్డుపడుతున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికుట్రలు పన్నినా తన సంకల్పాన్ని ఆపలేదని, ఎన్ని అవంతరాలు సృష్టించిన కుక్కర్లు పంపిణీ చేసి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. జోగు రామన్న వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఐనేని సంతోష్‌రావు, నాగర్కర్ శంకర్, షకీల్, కొండూరి రవి, ముఖీమ్, అంజద్ ఖాన్, కర్మ, అస్బాత్ ఖాన్, పుండ్రు రవి కిరణ్ రెడ్డి, ఎల్మ గంగారెడ్డి, బండి కిష్టన్న, సంతోష్ రెడ్డి, గడ్డం రామ్ రెడ్డి, లింగన్న, హరీష్ రెడ్డి, మహమూద్, కాలనీవాసులు సోమగారి వెంకటేష్, బబ్లు ఖాన్, షేక్ అతిక్, ఆరిఫ్ ఖాన్, మున్నిబాయి, అర్బాజ్, బూర్ల శంకర్, నర్మద, అన్నెల శంకర్, తదితరులు పాల్గొన్నారు.









