గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడారు. ‘‘రాబోయే తరాలకు పర్యావరణ కాలుష్యం లేకుండా అందించాలి. టీఎస్ఆర్టీసీ ఎన్ని కష్టాల్లో ఉన్న ప్రయాణికుల సంక్షేమమే ముఖ్యం. 550 బస్సులు హైదరాబాద్‌లో నడపాలని నిర్ణయించాం. ముందుగా 50 బస్సులు వచ్చాయి. అందులో 25 ఇవాళ ప్రారంభిస్తున్నాం. వచ్చే కొన్ని బస్సులు ఏసీ లేని బస్సులు వస్తున్నాయి. వాటిని కూడా ఏసీగా మార్చి నడిపించాలి. ఐటీ కారిడార్‌లోనే కాదు. కోకాపేట, ఎల్బీ నగర్‌తో హైదరాబాద్ చుట్టూ ప్రక్కల ఉన్న ప్రాంతాల నుంచి నడపాలి.
అలాగే మెట్రోకు వీటిని అనుసంధానం చేయాలి. అన్ని వైపులా ఇవే నడపాలి. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. కేంద్రం నుంచి సబ్సిడీ గతంలో వచ్చేది కానీ ఇప్పుడు అది కూడా తీసేసింది కేంద్రం. సీటింగ్ కెపాసిటీ కూడా పెంచేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఇందులో 35 సీట్ల సామర్ధ్యం మాత్రమే ఉంది. రాష్ట్రంలో యూవీ పాలసీ తీసుకొచ్చి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతుంది. కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించాలి. కోటి 52 లక్షల వాహనాలు తెలంగాణలో ఉన్నాయి. వీటన్నింటినీ ఎలక్ట్రిక్ దిశగా మార్చాలి. ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన సమస్య తీరింది. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాం. మరో నెలలో ఈ ప్రొసెస్ కూడా పూర్తవుతుంది. రవాణా శాఖ మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించి ఐదేళ్లు అవుతుంది. అనేక ఒడిదుడుగులు ఎదుర్కొన్నా.’ అని మంత్రి తెలిపారు.









