AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళా రిజర్వేషన్‌లో నా సీటు పోతే పోనివ్వండి: కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న వేళ.. మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలులో తన సీటు పోయినా .. వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్కును ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

మన జీవితాలు చాలా చిన్నవని.. తన పాత్ర తాను పోషించానని పేర్కొన్నారు. మహిళా కోటాలో తన సీటును వదులుకోవటానికి సిద్ధమేనని బిల్లును పూర్తిగా తాను స్వాగతిస్తుననట్లు చెప్పారు. ఇక హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. పెట్టుబడులకు నగరం అనువైన ప్రాంతమని అన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహానగరం చేరుకుందని చెప్పారు. దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు నగరం నుంచే వస్తున్నాయని కేటీఆర్ అన్నారు.

ANN TOP 10