AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి భేటీ ..

మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే సీత దయాకర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. సుదీర్ఘంగా చర్చించుకున్నారు. దీంతో ఇక కాంగ్రెస్ లో చేరిక నామ మాత్రం అని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డితో పలు విషయాలు చర్చించిన సీతా దయాకర్ రెడ్డి ఇక త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దీంతో గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మహబూబ్ నగర్ లో కొంత పట్టు దొరికినట్లు అయింది. ఆమె కాంగ్రెస్ లో చేరితే మాజీ టీడీపీ నేతలు ఇద్దరు హస్తం గూటికి చేరినట్లు అవుతుంది. రేవంత్ రెడ్డి కూడా టీడీపీనుంచి వచ్చిన విషయం తెలిసిందే. సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే పార్టీ బలోపేతమవుతుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు.

ANN TOP 10