AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అట్టహాసంగా హరితహారం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా.. మంచిరేవుల టెక్ పార్కులో 9వ విడత హరితహారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మొత్తం 1.25 కోట్ల మొక్కల్ని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నాటాలనే లక్ష్యం ఉంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మొక్కల్ని పంచిపెడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ల దగ్గర మొక్కల్ని నాటుతున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

ఇప్పటివరకూ 288.48 కోట్ల మొక్కల్ని నాటారు. వాటిలో చాలావరకు ఇప్పుడు చెట్లు అయ్యాయి. 9వ విడతలో మొత్తం 19.29 కోట్ల మొక్కలు నాటించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. హరితహారం ఫలాలను ఇప్పుడు మన ప్రత్యక్షంగా చూస్తున్నాం. తెలంగాణలో అడవులు బాగా పెరిగాయి. గ్రీనరీ బాగా పెరిగింది. చాలా పార్కులు వచ్చాయి. వన సంపద కూడా పెరిగింది. హైవేల పక్కన ఇదివరకు అంతగా గ్రీనరీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పచ్చదనంతో హైవేలకు అందం వచ్చింది. హరిత తెలంగాణ ఆవిష్కృతం అయ్యింది.

ANN TOP 10