ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రజాయుద్ధనౌక గద్దర్ కుటుంబ సభ్యులను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. కు మంగళవారం అల్వాల్ వెంకటాపురం భూదేవినగర్ లోని గద్దర్ నివాసానికి స్వయంగా వచ్ఛిన చంద్రబాబు నాయుడు గద్దర్ భార్య విమలా గద్దర్ తో పాటుగా ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ…. గద్దర్ చనిపోవడం బాధాకరమని, ఆయన ఒక వ్యక్తి కాదు వ్యవస్థగా అభివర్ణించారు. ప్రజా చైతన్యంతో మొదట గుర్తు వచ్చే వ్యక్తి గద్దర్ అని, ఆయన పాట, ఆయన కృషి ఎప్పటికి మర్చిపోలేమన్నారు.
పేదల హక్కుల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తిగా చిరకాలం గుర్తుండిపోయే వ్యక్తి గా గద్దర్ ప్రజల మనసుల్లో నిలిచిపోతారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తాము రాజకీయాల్లో ఉండి ప్రజా చైతన్యం కోసం పని చేస్తే… గద్దర్ ప్రజలు, పేదల హక్కుల పరిరక్షణ కోసం ఒక పంథాను ఎంచుకొని కృషి చేశారని కొనియాడారు. తద్వారా పోరాటాలకు నాంది పలికారు. తెలంగాణ పోరాటం లో ఎంతో కృషి చేసారని పేర్కొన్నారు. ఆయనను చూస్తేనే ప్రజా యుద్ధ నౌక గుర్తు వస్తుందన్నారు. దేనికి భయపడని వ్యక్తిగా, పొరటలే ప్రాణంగా గద్దర్ జీవనం కొనసాగించారని, ఆయన స్పూర్తి శాశ్వతంగా ఉంటుందన్నారు.తెలుగు జాతి మంచి ఉద్యమ కారుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులు ఆయన ఆశయాలు కొనసాగించాలని సూచించారు.