వేడుకల్లో ప్రత్యేకత చాటుకున్న ఆదర్శనేత కంది శ్రీనివాసరెడ్డి
ఆడంబరాలకు దూరంగా..ఆపన్నులకు అండగా నిలిచిన కేఎస్ఆర్
ఆదిలాబాద్ః నేతలు అనేకం..అందులో కంది ప్రత్యేకం..ఇదేదో సినిమా డైలాగు కాదు..కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యక్షంగా ఆచరించిన మార్గం. ఇటీవల వరదల కారణంగా వందలాది మంది నష్టపోవడంతోపాటు కాంగ్రెస్‌కు చెందిన దిగ్గజ నేత చిల్కూరి రామచంద్రారెడ్డి ఆకస్మిక మరణం నేపథ్యంలో ఆడంబరాలకు దూరంగా కేఎస్ఆర్ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.పై కారణాలతో ముందుగానే తన అనుచరులు, కార్యకర్తలకు సూచించిన కేఎస్ఆర్ వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులను సేవాదీక్ష పేరిట పంపిణీ చేశారు. ఉదయం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రజాసేవా భవన్‌లో జన్మదినం సందర్భంగా అన్నిమతాలకు చెందిన పండితులు, మతపెద్దలు వచ్చి కంది శ్రీనివాసరెడ్డి మేలుకోరుతూ సర్వమత ప్రార్థనలు చేశారు. ఆయా మత పద్ధతుల ప్రకారం కేఎస్ఆర్‌ను ఆశీర్వదించారు. అనంతరం వరద ప్రాంతాలైన ఖానాపూర్, తాటిగూడ, ఖుర్షీద్ నగర్, భగత్ సింగ్ నగర్, KRK కాలనీలతో పాటు జైనథ్, బేల మండలాల్లో కేఎస్ఆర్ పర్యటిస్తూ బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు. అటు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో ప్రజాసేవా భవన్ సందడిగా మారింది.

ఆదర్శనేత
ప్రస్తుత తరుణంలో రాజకీయ నాయకులు ఏ స్థాయివారైనప్పటికీ తమ జన్మదిన వేడుకలను అత్యంత ఆడంబరంగా నిర్వహించుకోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ప్రజా పరిస్థితులు ఏవైనప్పటికీ తమకు పట్టనట్టుగా వ్యవహరించడం రాజకీయ నాయకులకు అలవాటైపోయింది. అయితే దీనికి భిన్నంగా కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి వ్యవహరించడం ఆయన ఆదర్శ వ్యక్తిత్వానికి నిదర్శనం. కొద్దిరోజుల క్రితం వరకు వరుస వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో తన జన్మదిన వేడుకలను ఆడంబరాలకు దూరంగా నిర్వహించడం..అదే సమయంలో ఆపన్నులకు అండగా నిల్వడం గమనార్హం. జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు ఇటీవలే తమ జన్మదిన వేడుకలను ఆడంబరంగా నిర్వహించుకోవడం..అందుకు భిన్నంగా కంది శ్రీనివాసరెడ్డి ఆడంబరాలకు దూరంగా ఉండడంపై చర్చించుకుంటున్నారు.










