AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్టీసీ బిల్లుపై తేల్చేసిన గవర్నర్.. కార్మిక సంఘ నేతలతో ఏం చెప్పారంటే?

ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించారని ఆర్టీసీ కార్మిక సంఘం నేత థామస్ రెడ్డి తెలిపారు. నేడు ఆర్టీసీ యూనియన్ నేతలతో గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సానుకూలంగా వున్నారని..ప్రభుత్వ వివరణ అందిన తరువాత బిల్లును ఆమోదిస్తానని చెప్పినట్టు థామస్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ప్రభుత్వ వివరణ ఇంకా అందలేదని..ఆ వివరణ వచ్చాక ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపే బిల్లుపై సంతకం చేస్తానని గవర్నర్ చెప్పారన్నారు. దీనితో ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు.

అయితే ఇప్పటికే గవర్నర్ అభ్యంతరాలపై వివరణ ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. 5 అంశాలకు గాను 3 అంశాలకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏపీ తరహాలోనే విలీన ప్రక్రియ ఉంటుందని..కార్పొరేషన్ కంటే ఎక్కువగానే జీతాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీ విలీనం తరువాత రూపొందించే గైడ్ లైన్స్ ప్రకారమే జీతభత్యాలు సహా అన్ని అంశాలు వుంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఈరోజు ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వ వివరణ తరువాతే ఆమె బిల్లును ఆమోదించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈరోజు గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లును ఆమోదిస్తే రేపు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ANN TOP 10