AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

న్యాయ సలహా తీసుకుంటా .. ఆర్టీసీ బిల్లుపై స్పందించిన గవర్నర్ తమిళిసై

ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌదర రాజన్ స్పందించారు. బిల్లును పరిశీలించడానికి కొంత సమయం కావాలని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. టీఎస్ ఆర్టీసీ బిల్లు బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు చేరిందని తెలిపిన గవర్నర్… బిల్లుపై ఉన్న సందేహాల పట్ల న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉందని.. అందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టాలని కేసీఆర్ సర్కార్ భావించింది. కాగా.. ఇది ఆర్థికపరమైన బిల్లు కావడంతో పద్ధతి ప్రకారం గవర్నర్‌కు పంపించింది.

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటమే కాకుండా.. సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. ఇటీవల సమావేశమైన కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయానికి అనుగుణంగా సర్కారు బిల్లు రూపొందించింది. కానీ.. అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఇప్పటికీ గవర్నర్‌ తమిళిసై నుంచి అనుమతి రాలేదు. బిల్లును గవర్నర్‌‌కు పంపించి రెండు రోజులు గడుస్తున్నప్పటకీ.. ఇంకా ఆమోదం తెలపకపోవటంతో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆలస్యం కానుంది.

మరోవైపు… ఈ అసెంబ్లీ సమావేశాలు కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో.. రేపు ఒక్క రోజే సమయం ఉండగా.. గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటం వల్ల.. మరి సమావేశాల గడువు ఇంకా పొడిగించనున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ANN TOP 10